Shrimad Bhagavad Gita in Telugu [Buy Online] @ Rs.60 Only

60.00

In stock

✓ 100% Natural and Pure Products
✓ 100% Secure Payments.
✓ Efficient Price.

Guaranteed Safe Checkout

Shrimad Bhagavad Gita in Telugu [Buy Online] @ Rs.60 Only
Shrimad Bhagavad Gita in Telugu [Buy Online] @ Rs.60 Only
60.00

శ్రీమద్ భగవద్గీత

 

మాహాత్మ్యం – శ్లోకాలు – అనువాదం

 

గీత నా హృదయం. గీత నా ఉత్తమ సారం. గీత నా అవినాశి జ్ఞానం. గీత నా శ్రేష్ఠమైన నివాసస్థానం. గీత నా పరమ పదం. గీత నా పరమ రహస్యం. గీత నా పరమ గురువు.

 

భగవాన్ శ్రీ కృష్ణ

 

‘శ్రీమద్ భగవద్గీత’ ఉపనిషత్తులనే తోటలలో నుండి ఏరిన ఆధ్యాత్మిక సత్యాలనే పువ్వులతో అల్లిన పూల గుత్తి.

 

స్వామి వివేకానంద

 

పూజ్య బాపు గారి పావన సందేశం

 

మనం ధనవంతులం అవుతామో లేదో, యశస్వీ అవుతామో లేదో, ఎన్నికలలో గెలుస్తామో లేదో అనే విషయంలో సందేహం ఉండవచ్చు, కానీ అయ్యా! మనం చనిపోతామా లేదా అనే దాంట్లో ఏదైనా సందేహం ఉందా? విమానం టేకాఫ్ అయ్యే సమయం ఖచ్చితంగా ఉంటుంది, బస్సు బయలుదేరే సమయం ఖచ్చితంగా ఉంటుంది, రైలు బయలుదేరే సమయం ఖచ్చితంగా ఉంటుంది, కానీ ఈ జీవితపు బండి నిలిచిపోయే సమయం ఏదైనా ఖచ్చితంగా ఉందా?

 

ఈ రోజు వరకు మీరు జగత్తు గురించి ఏమేమి తెలుసుకున్నారో, ఏమి పొందారో… ఈ రోజు తర్వాత మీరు ఏమి తెలుసుకుంటారో మరియు పొందుతారో, ప్రియమైన సోదరా! అవన్నీ మృత్యువు యొక్క ఒక్క కుదుపుతో విడిపోతాయి, తెలిసినవి కాస్తా తెలియనివి అయిపోతాయి, లభించినవి కాస్తా లభించనివిగా మారిపోతాయి.

 

కాబట్టి జాగ్రత్తపడండి. అంతర్ముఖులై మీ యొక్క అచలమైన ఆత్మను, నిజస్వరూపం యొక్క అగాధమైన ఆనందాన్ని, శాశ్వత శాంతిని పొందికపరచుకోండి. అప్పుడు మీరే అవినాశి అయిన ఆత్మ అవుతారు.

 

మేల్కొనండి…. లెవండి….. మీ అంతఃప్రజ్ఞలో నిద్రపోతున్న నిశ్చయ బలాన్ని మేల్కొలపండి. సర్వదేశాలందు, సర్వకాలములందు అత్యుత్తమమైన ఆత్మబలాన్ని ఆర్జించండి. ఆత్మలో అపారమైన సామర్థ్యం ఉంది. నిన్ను నువ్వు దీనహీనుడిగా భావిస్తే, నిన్ను పైకి లేపగల శక్తి ఈ విశ్వంలో ఏదీ లేదు. మీ ఆత్మస్వరూపంలో మీరు ప్రతిష్ఠితులైతే, మిమ్మల్ని అణచివేయగల శక్తి త్రిలోకాలలోనూ ఏదీ లేదు.

 

ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి; ఇటుకటుగా ఆలోచనలతో (వృత్తులతో) మీ శక్తి కూడా చెల్లాచెదురైపోతూ ఉంటుంది. కాబట్టి వృత్తులను తప్పుదోవ పట్టించకండి. సమస్త వృత్తులను ఏకంచేసి సాధనా కాలంలో ఆత్మచింతనలో నిమగ్నం చేయండి; వ్యవహార కాలంలో చేసే పనిలో వాటిని వినియోగించండి. ఏకాగ్రతతో ప్రతి పనీ చేయండి. ఎల్లప్పుడూ శాంత స్వభావాన్ని అలవర్చుకునే అభ్యాసం చేయండి. విచారశీలుడుగా మరియు ప్రసన్నంగా ఉండండి. ప్రాణికోటిని మీ స్వరూపంగా భావించండి. అందరితో స్నేహంగా ఉండండి. విశాలమైన హృదయాన్ని కలిగి ఉండండి. ఆత్మనిష్ఠలో జాగృతమైన మహాపురుషుల सत्संग (సత్సంగం) మరియు సత్సాహిత్యంతో జీవితాన్ని భక్తి, వేదాంతాల ద్వారా పరిపుష్టం మరియు పులకింపజేసుకోండి.

Additional information

Weight 300 g

Reviews

There are no reviews yet.

Be the first to review “Shrimad Bhagavad Gita in Telugu [Buy Online] @ Rs.60 Only”

Your email address will not be published. Required fields are marked *